సిటీబ్యూరో: బోయిన్పల్లి పరిధిలో హెచ్‌న్యూ, స్థానిక పోలీసులు భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. రూ. 8.5 కోట్ల విలువైన ఎఫిటమైన్ను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. బౌరంపేట్‌కు చెందిన గోసుకొండ అంజిరెడ్డి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో చంద్రారెడ్డి పేరుతో ఫంక్షన్ హాల్, స్విమ్మింగ్ పూల్ నిర్వహించేవాడు. సాయికుమార్, రాకేశ్‌తో పరిచయమైంది.
ఈ ఇద్దరితో కలిసి అల్ఫాజోలంను తయారు చేయాలని అంజిరెడ్డి ప్లాన్ చేశాడు. గ్రామంలో కొత్తపల్లి ప్రభాకర్‌గౌడ్ సహకారంతో కోళ్ల ఫారంలో గదిని అద్దెకు తీసుకొని.. రియాక్టర్‌ను ఏర్పాటు చేశాడు. బాలానగర్ నుంచి అంజిరెడ్డి ముడి సరుకులు తెచ్చి సాయిగౌడ్, రాకేశ్‌లకు ఇస్తే.. వారు ఆల్ఫాజోలం, ఎఫిటమైన్ మత్తుపదార్ధాలను తయారు చేసి..మార్కెట్లో అమ్మడం చేసేవారు.జూన్ 18న కోళ్ల ఫారంపై పోలీసులు దాడి చేసి.. అంజిరెడ్డిని అరెస్ట్ చేసి 2.6 కిలోల ఆల్ఫాజోలంతో పాటు ముడిసరకును స్వాధీనం చేసుకున్నారు.
టీజీనాబ్కు అంజిరెడ్డి చిక్కడానికి 10 రోజుల ముందే కోళ్లఫారంలో తయారు చేసిన 8.5 కిలోల ఎఫిటమైన్ డ్రగ్‌ను తన అనుచరుడైన గుమ్మిడిదలకు చెందిన కుంచల నాగరాజుకు అందించి.. దానిని భద్రపరుచాలని సూచించాడు.ఈ క్రమంలో నాగరాజు తన వద్ద డ్రగ్‌ను నగరానికి తీసుకెళ్లి అక్కడ అవసరమైన వారికి విక్రయించాలని ప్లాన్ చేశాడు. తన స్నేహితులు వినోద్‌కుమార్‌గౌడ్, శ్రీశైలం సహకారం తీసుకున్నాడు. వాహనంలో బయలుదేరిన ఈ ముగ్గురిని విశ్వసనీయ సమాచారంతో హెచ్‌న్యూ బృందం బోయిన్‌పల్లిలో పట్టుకున్నది. 8.5 కిలోల ఎఫిటమైన్ను స్వాధీనం చేసుకొని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. కాగా, సౌత్‌వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గంజాయి ముఠాను అరెస్టు చేసి.. 10 కిలోల సరుకును స్వాధీనం చేసుకున్నారు.