హైదరాబాద్: గచ్చిబౌలిలో మరోసారి డ్రగ్స్ పార్టీ (Drugs Party) కలకలం సృష్టించింది. గచ్చిబౌలిలోని కోలివింగ్ గెస్ట్ రూంలో జరుగుతున్న డ్రగ్ పార్టీని ఎస్వోటీ పోలీసులు భగ్నం చేశారు. డ్రగ్స్ సరఫరా చేసినవారితోపాటు పార్టీలో పాల్గొన్న 12 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి ఎండీఎంఏ, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లు కర్ణాటక నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ యువకులకు అమ్ముతున్నట్లు గుర్తించారు.
డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న గుత్తా తేజకృష్ణతోపాటు ఓ నైజీరియన్ (డ్రగ్ పెడ్లర్), వెన్నెల రవికిరణ్, మన్నె ప్రశాంత్, పీ. హర్షవర్ధన్‌రెడ్డి, పకనాటి లోకేశ్‌రెడ్డి, పృథ్వి విష్ణువర్ధన్, కార్లపొడి వెస్లీ సుజీత్, గుండబోయిన నాగార్జున, మేకల గౌతం, గుటక సతీశ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.