సైదాబాద్, జూన్ 28: సైదాబాద్‌లోని (Saidabad) వికాస భారతి హై స్కూల్ విద్యార్థులకు మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో శనివారం జరిగిన కార్యక్రమంలో సైదాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి, పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ పాల్గొని విద్యార్థులకు డ్రగ్స్ రహిత సమాజం గూర్చి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ మాట్లాడుతూ.. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటిని విక్రయించే వ్యక్తుల సమాచారం పోలీసులకు తెలియజేయాలన్నారు. పోలీస్ స్టేషన్లో రోజూ వారిగా జరిగే కార్యక్రమాల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వికాస భారతి హై స్కూల్ కరస్పాండెంట్ భరణి కుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.