కుషాయిగూడలో ఎల్బీనగర్ ఎస్వోటీ దాడులు
నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరితోపాటు డ్రగ్స్ వినియోగిస్తున్న ముగ్గురినిఎల్బీనగర్ జోన్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.12లక్షల విలువజేసే 100 గ్రాముల హెరాయిన్, 6 సెల్ఫోన్లు, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు.
- హెరాయిన్ విక్రయిస్తున్న ఇద్దరి సహా.. ముగ్గురు వినియోగదారులు అరెస్టు
- రూ.12లక్షల విలువజేసే 100 గ్రాముల హెరాయిన్ స్వాధీనం
సిటీబ్యూరో, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరితోపాటు డ్రగ్స్ వినియోగిస్తున్న ముగ్గురినిఎల్బీనగర్ జోన్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.12లక్షల విలువజేసే 100 గ్రాముల హెరాయిన్, 6 సెల్ఫోన్లు, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ సుధాకర్ కథనం ప్రకారం… రాజస్థాన్‌కు చెందిన బజరంగ్ బిష్ణోయి అలియాస్ బజరంగ్(21), మహేందర్ బిష్ణోయి(19) కలిసి ఉపాధి కోసం నగరానికి వలసొచ్చారు. వీరిద్దరూ నేరేడ్మెట్లో నివాసముంటూ గ్యాస్ స్టౌ రిపేయిర్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు. వచ్చిన సంపాదన సరిపోవడం లేదు. సులభంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలో బజరంగ్ బిష్ణోయి రాజస్థాన్‌లో తనకు పరిచయం ఉన్న ఓ వ్యక్తి ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసి, తన దగ్గరి బంధువైన మహేందర్ బిష్ణోయి సహకారంతో నగరంలో విక్రయించడం మొదలు పెట్టాడు. బజరంగ్ సూచన మేరకు మహేందర్ డ్రగ్ పార్శిళ్లను రాజస్థాన్ నుంచి నగరానికి ప్రైవేటు, ఆర్టీసీ, లారీల్లో తరలిస్తున్నాడు. ఈ విధంగా తీసుకొచ్చిన డ్రగ్స్‌ను బజరంగ్ నగరంలో తనకు పరిచయం ఉన్న వినియోగదారులకు నేరుగా, రాపిడో ద్వారా విక్రయిస్తాడు.
ఈ క్రమంలోనే సోమవారం కుషాయిగూడ ప్రాంతంలో డ్రగ్స్‌ను విక్రయిస్తుండగా.. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ జోన్ ఎస్వోటీ బృందం కుషాయిగూడ పోలీసులతో కలిసి బజరంగ్, మహేందర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారితో పాటు డ్రగ్స్‌ను కొనుగోలు చేసిన రాజస్థాన్‌కు చెందిన అభిషేక్ బిషోని(19), పుక్రాజ్ బిషోని(20), శిషుపాల్ బిషోని(19)ని కూడా అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.12 లక్షల విలువజేసే 100 గ్రాముల హెరాయిన్, 6 సెల్ఫోన్లు, ఒక ద్విచక్రవాహనం, రూ.820 నగదును స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును కుషాయిగూడ పోలీసులకు అప్పగించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

