Jubilee Hills | జూబ్లీహిల్స్ : గుర్తు తెలియని వ్యక్తులు చాకెట్లు ఇస్తే తీసుకోవద్దని.. సదరు వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు వెంటనే చెప్పాలని యాంటీ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. యూసుఫ్‌గూడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు యాంటీ డ్రగ్స్‌పై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని పాఠశాలల్లో యాంటీ డ్రగ్స్ ప్రహరీ గోడ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
పాఠశాలకు దగ్గరలో ఉన్న పాన్‌షాప్‌లు, కిరాణ దుకాణాల్లో డ్రగ్స్ సంబంధిత చాక్లెట్లు, ఇతర వస్తువులు అమ్మితే ప్రహరీ కమిటీకి, 1098 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. యూసుఫ్‌గూడ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు పరమేశ్వరమ్మ ఎస్సీహెచ్ఓగా నలుగురు ఉపాధ్యాయులు, విద్యార్థులతో కమిటీని ఏర్పాటు చేశారు. అనంతరం విద్యార్థులతో డ్రగ్స్‌ను తరిమికొడతామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఉపాధ్యాయులతో కలిసి ర్యాలీ తీశారు. పాఠశాల ఎన్సీసీ అధికారి పీ ప్రభాకర్, ఫిజికల్ డైరెక్టర్లు విశ్వేశ్వర రావు, మద్దీశ్వర్, తెలుగు టీచర్ నాగరాజు పాల్గొన్నారు.