సిటీబ్యూరో, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా వాటర్ సప్లయి ఫేజ్ 1, 2 పంప్‌హౌజ్‌లో స్లూయిస్ వాల్వ్ రిపేర్లు, కలబ్గూర్, రాజంపేట్, పటాన్చెరు సబ్స్టేషన్లలో ఎలక్ట్రికల్ పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. ఈ పనులు ఈ నెల 29 గురువారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఈ ఆరు గంటల పాటు ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట్ (లో వాటర్ ప్రెషర్), డివిజన్-8, హైదర్‌నగర్ రిజర్వాయర్ పరిధిలోని కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్పల్లి, భాగ్యనగర్ కాలనీ, వసంత్‌నగర్, ఆర్సీ పురం, అశోక్‌నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, దీప్తి శ్రీనగర్, మదీనాగూడ, మియాపూర్‌తో పాటు మంజీరా ఫేజ్-1, బీరంగూడ, అమీన్పూర్, బొల్లారంలో అంతరాయం ఉంటుందని తెలిపారు.