అటు లీకేజీ.. ఇటు కలుషిత నీరు
ఉమ్మడి అల్లాపూర్ డివిజన్ వ్యాప్తంగా తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. కొన్ని చోట్ల పైపులైన్లు లీకేజీ కావడంతో నీరు కలుషితమవుతున్నది. దీంతో ఆ నీటిని తాగిన వారు వ్యాధుల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నారు. మరికొన్ని చోట్ల లోఫ్రెజర్ కారణంగా సక్రమంగా నీటి సరఫరా కావడం లేదు. అయినా అధికారులు స్పందించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
అల్లాపూర్, మే 10:ఉమ్మడి అల్లాపూర్ డివిజన్ వ్యాప్తంగా తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. కొన్ని చోట్ల పైపులైన్లు లీకేజీ కావడంతో నీరు కలుషితమవుతున్నది. దీంతో ఆ నీటిని తాగిన వారు వ్యాధుల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నారు. మరికొన్ని చోట్ల లోఫ్రెజర్ కారణంగా సక్రమంగా నీటి సరఫరా కావడం లేదు. అయినా అధికారులు స్పందించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. తాజాగా గాయత్రినగర్ కాలనీలో లిటిల్ స్టార్ స్కూల్ సమీపంలోని నివాసితులకు గత పదిరోజుల నుండి మురుగువాసనతో తాగునీరు సరఫరా అవుతున్నది.
సమస్యను పలుమార్లు జలమండలి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, ‘ఇదిగో వస్తాం, అదిగో చూస్తాం’ అంటూ జాప్యం చే స్తున్నారని కాలనీవాసులు వాపోతున్నారు. ఎట్టకేల్లకు నాలుగు రోజుల క్రితం వచ్చిన జలమండలి సిబ్బంది, పైపులైన్ లీకేజీని గుర్తించి రోడ్డు తవ్వి పైపులైన్‌కు మరమ్మతు చేయకుండా వదిలేశారు. దీంతో కలుషిత నీటిని తాగడం వ ల్ల వ్యాధుల బారిన పడుతున్నామని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. ఒక వైపు వేసవి కాలం కావడంతో భూ గర్భ జలాలు అడుగంటిపోయాయని, మరోవైపు సక్రమం గా తాగునీరు సరఫరా గాక, వచ్చిన నీరు కలుషితం కావం తో ట్యాంకర్లపైనే అధారపడాల్సిన దుస్థుతి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పైపులైన్ లీకేజీలు అరికట్టి నాణ్యమైన తాగునీరు సరఫరా చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

