జోహన్నెస్‌బర్గ్, దక్షిణాఫ్రికా : భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) 50వ జన్మదినాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా(BRS NRI South Africa) సన్నాహకాలు చేస్తోంది. జూలై 23, గురువారం కేటీఆర్ బర్త్ డేను బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా నాయకులు నాగరాజు గుర్రాల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగనున్నాయి. మూడు ప్రధాన నగరాలైన జోహన్నెస్‌బర్గ్, కేప్‌టౌన్, పియెటర్మారిట్జ్బర్గ్లలో ఒకేసారి “Gifting Smiles, Celebrating KTR @ 50” పేరుతో విస్తృత స్థాయిలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నాగరాజు తెలిపారు.
దక్షిణాఫ్రికాలోని మూడు ప్రధాన నగరాల్లో కేటీఆర్ పుట్టిన రోజు కార్యక్రమాలు జూలై 23వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతాయిని నాగరా గుర్రాల పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం అనాథాశ్రమాలను సందర్శించి చిన్నారులకు అవసరమైన నిత్యావసర వస్తువులు, ఆహార, పరిశుభ్రత సామగ్రి అందజేస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో కొనసాగుతున్న చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని చిన్నారులకు దుప్పట్లను కూడా పంపిణీ చేస్తామని నాగరాజు చెప్పారు. సమాజ సేవ, మానవతా విలువలు, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవాలనే కేటీఆర్ ఆలోచనలకు స్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా తెలిపింది.
కేటీఆర్ పుట్టినరోజు వేడుకల బాధ్యతలను బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌతాఫ్రికా పలువురికి అప్పగించింది. జోహన్నెస్‌బర్గ్ (గౌటెంగ్) దక్షిణాఫ్రికా పోలీస్ సర్వీస్ (మిడ్రాండ్) సహకారంతో అరవింద్ ప్రసాద్ చీకోటి ఆధ్వర్యంలో New Jerusalem Home – Steyn Road, President Park, Midrand* Tumelo Home – Steyn Road, President Park, Midrand* Yenzani Children’s Home – Poplar Street, Noordwyk, Midrand
* Cluny Farm Centre – Kyalami, Midrand* New Life Centre for Girls – Brand Road, President Park, Midrandలో కార్యక్రమాలు జరుగుతాయి. కేప్‌టౌన్ (వెస్టర్న్ కేప్)చేతన్ కొరబోయిన ఆధ్వర్యంలో Durbanville Children’s Home – 1 Church Street, Durbanville, Cape Town, 7550 లో కేటీఆర్ బర్త్ డే, తదనంతర కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక పియెటర్మారిట్జ్బర్గ్ (క్వాజులు-నటాల్) సంతోష్ కుమార్ ధీకొండ ఆధ్వర్యంలో Thandi House – 708 Chase Valley Road, Chase Valley, Pietermaritzburg, 3231 కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరుగుతాయి. ఈ సేవా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా సభ్యులు, తెలంగాణ వాసులు, స్థానిక స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొని చిన్నారులతో ఆనందాన్ని పంచుకోనున్నారని నాగరాజు తెలిపారు.
“కేటీఆర్ 50వ జన్మదినాన్ని కేవలం వేడుకగా కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా గుర్తుండిపోయేలా చేసుకోవాలనేది మా ఉద్దేశం. ఆ లక్ష్యంతోనే దక్షిణాఫ్రికాలోని మూడు ప్రధాన నగరాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నా. ఇక్కడ చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని చిన్నారులకు దుప్పట్లను అందించడం, నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం ద్వారా వారి ముఖాల్లో చిరునవ్వులు నింపడమే కేటీఆర్‌కు మేము అందించే నిజమైన జన్మదిన కానుక” అని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా నాయకులు నాగరాజు గుర్రాల ఒక ప్రకటనలో తెలిపారు.