వారం రోజులుగా నరకయాతన
మలక్‌పేట ప్రధాన రహదారిపై పైప్‌లైన్ పగిలిపోయింది. ఫలితంగా రహదారిపైకి మురుగునీరు ముంచెత్తడంతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. వరద కాలువ నీటి కాలువ, డ్రైనేజీ కాలువ వేర్వేరుగా లేకపోవడంతో ఒకే దాంట్లో మురుగునీరు, వర్షపు నీరు ప్రవహించడంతో డ్రైనేజీ పైప్‌లైన్ పగిలిపోయింది. ఫలితంగా మురుగునీరు రోడ్లను ముంచెత్తింది.
- మలక్‌పేట ప్రధాన రహదారిపై పగిలిన డ్రైనేజీ పైప్‌లైన్
- రహదారిని ముంచెత్తిన మురుగునీరు
- వాహనదారుల అసవ్థలు
- గంటల తరబడి ట్రాఫిక్ జామ్.. జఠిలంగా మారిన సమస్య..
- మురుగునీటి ప్రాంతాన్ని సందర్శించిన అధికారులు
- పైప్‌లైన్ నిర్మాణ పనులు షురూ
- ఆ మార్గంలో ట్రాఫిక్ నియంత్రణ
సైదాబాద్ మే 31 : మలక్‌పేట ప్రధాన రహదారిపై పైప్‌లైన్ పగిలిపోయింది. ఫలితంగా రహదారిపైకి మురుగునీరు ముంచెత్తడంతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. వరద కాలువ నీటి కాలువ, డ్రైనేజీ కాలువ వేర్వేరుగా లేకపోవడంతో ఒకే దాంట్లో మురుగునీరు, వర్షపు నీరు ప్రవహించడంతో డ్రైనేజీ పైప్‌లైన్ పగిలిపోయింది. ఫలితంగా మురుగునీరు రోడ్లను ముంచెత్తింది. గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌కు కారణమైంది. సమస్య జటిలంగా మారడంతో అధికారులు పైప్‌లైన్ నిర్మాణ పనులను చేపట్టారు.
ప్రధాన రహదారిపై పరేషాన్
డ్రైనేజీ పైప్ పగిలిపోవడంతో మురుగు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో రోడ్లన్నీ గుంతలమయంగా మారి అధ్వానంగా తయారైంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర సౌకర్యంగా మారింది. కాగా, చంచల్‌గూడ జైలు వద్ద నుంచి వచ్చే వరద నీటి కాలువ పిల్లర్ నంబర్ 14, 18 వద్ద డ్రైనేజీ లైన్ లో కలవడంతోని ముంపు సమస్య ఏర్పడింది. ఒకే లైన్లో వరదనీటి కాలువ, మురుగు కాలువ కలిసి ఉండడంతోనే తరచూ మురుగునీరు పొంగిపొర్లుతున్నది. ప్రస్తుతం ఉన్న సామర్థ్యం కంటే మురుగునీరు వరద నీరు ప్రవహిస్తుండటంతో డ్రైనేజీ లైన్లో లీకేజీలు అవుతున్నాయి.
సమస్య నివారించడానికి జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు రెండు వేర్వేరు పైప్లైన్ల పనులను చేపట్టాలని నిర్ణయించి, వాటి పనుల ప్రక్రియను ప్రారంభించారు. కాగా, నల్గొండ చౌరస్తా మార్గంలోడ్రైనేజీ మురుగునీరు వారం రోజులుగా పొంగిపొర్లుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మురుగు నీరంతా మలక్‌పేట అండర్ రైల్వే బ్రిడ్జి వరకు వెళ్లడంతో వాహనదారులు ఇబ్బందులుపడుతున్నారు.మలక్ పేట రైల్వే బ్రిడ్జి వద్ద మురుగునీరు నిలిచి పోవడంతో గంటల తరబడి వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు.
ఇదిలా ఉంటే మలక్‌పేట- నల్గొండ క్రాస్ రోడ్డులో మురుగునీరు ప్రవహిస్తున్న ప్రాంతాన్ని జీహెచ్ఎం కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవీస్, జలమండలి సీజీఎం నాగేంద్ర కుమార్, మలక్ పేట జీహెచ్ఎంసీ డీసీ జయంత్, ఉన్నతాధికారులు సందర్శించారు.మురుగునీటి ఆధునీకరణ పనులు రెండు రోజుల్లో పూర్తి చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు.
ట్రాఫిక్ దారి మళ్లింపు
చాదర్‌ఘాట్ నుంచి దిల్సుఖ్నగర్ వైపు వచ్చే ప్రయాణికులు పనులు పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలని ట్రాఫిక్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

