కొండాపూర్, మే 13: జీహెచ్ఎంసీలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న కాలనీలలో ప్రేమ్ నగర్ (Prem Nagar)ఒకటి. శేరిలింగంపల్లి సర్కిల్-20 కొండాపూర్ డివిజన్లోని ప్రేమ్ నగర్ బీ బ్లాక్ కాలనీ అన్ని విధాలుగా అభివృద్ధిలో ముందుకు సాగుతున్నది. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉంటున్నా సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి.
రోజు రోజుకు పెరిగిపోతున్న నిర్మాణాలతో డ్రైనేజీ, తాగునీటి సమస్యలు తీవ్రమవుతున్నాయి. స్థానికులు తమ సమస్యలపై ప్రతిరోజు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ పట్టించుకునే వారు కరువయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగు నీరు రోడ్లపై పరుగులు తీస్తున్నా.. మంచి నీళ్ల కోసం గంటల తరబడి నల్లాల దగ్గర పడిగాపులు కాస్తున్నామంటున్నారు. అధికారులు తమ కాలనీ సమస్యలను పరిగణనలోకి తీసుకుని పరిష్కరించాలంటూ వేడుకుంటున్నారు.