మాదాపూర్, డిసెంబర్ 11: ప్రముఖ విశ్వవిద్యాలయం కేఎల్ డీమ్డ్ టుబీ యూనివర్సిటీ విద్య, నైపుణ్యాభివృద్ధిలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించినట్లు కేఎల్ యూనివర్సిటీ వీసీ , డాక్టర్ జి. పార్థసారధి వర్మ అన్నారు. గోవాలో జరిగిన ఏఐసీటీఈ అడ్యుస్కిల్స్- కనెక్ట్ 2023 సదస్సులో కేఎల్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీకి చెందిన కేఎల్హెచ్ హైదరాబాద్, విజయవాడ క్యాంపస్లు అత్యున్నత అవార్డులను అందుకున్నాయి.
ఈ నేపథ్యంలో సోమవారం కొండాపూర్లోని కేఎల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి కేఎల్ యూనివర్సిటీ వీసీ, డాక్టర్ జి. పార్థసారధి వర్మ హాజరయ్యారు. స్టూడెంట్ ప్రోగ్రెషన్, స్కిల్ డెవలప్మెంట్ డీన్, డాక్టర్ ఎ. శ్రీనాథ్, కేఎల్హెచ్ హైదరాబాద్ ప్రిన్సిపాల్ ఎ. రామకృష్ణలతో కలిసి మాట్లాడారు. కేఎల్ యూనివర్సిటీ విద్య, నైపుణ్యాభివృద్ధిలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శిస్తూ భారతదేశంలో 15 వందలకు పైగా సంస్థల నుంచి వివిధ విభాగాల్లో 15 అవార్డులను అందుకున్న ఘనత కేఎల్ యూనివర్సిటీదేనని అన్నారు.