హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవుట్రీచ్ సెషన్ నిర్వహించారు. 2030 నాటికి 193 దేశాల్లో 5జీ, 6జీ సేవలు విస్తృతం కానున్నందున.. ఈ పురోభివృద్ధిలో భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో గురువారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా నేషనల్ కమ్యూనికేషన్ అకాడమీ జనరల్ డైరెక్టర్ దేబ్కుమార్ చక్రవర్తి, ప్రొఫెసర్లు ఆర్ఆర్ మిట్టార్, ప్రతీక్శర్మ, భరద్వాజ్ అమృతార్, అతుల్సిన్హా, రాజేశ్గుప్తా, అవినాష్ అగర్వాల్ మాట్లాడుతూ.. టెక్నాలజీలో భారత్ పురోగమిస్తున్నందున.. ఇందులో ఐఐఐటీ విద్యార్థులు భాగస్వాములై నూతన ఆవిష్కరణలకు నాంది పలుకాలని ఆకాంక్షించారు. డాట్ ప్రతినిధి మహేంద్రశర్మ ఈ కార్యక్రమ ప్రాధాన్యతను వివరించారు.