బొల్లారం,నవంబర్ 8: బడుగు,బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిపించాలని రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్ అన్నారు. బుధవారం కంటోన్మెంట్ ఎనిమిదో వార్డు బొల్లారం సదర్ బజార్,టీఐటీ బ్లాక్ ,అంబేద్కర్ నగర్లో బస్తీల్లో బోర్డు మాజీ సభ్యుడు లోక్నాథ్,మార్కెట్ వైస్ చైర్మన్ వేణు గోపాల్ రెడ్డితో కలిసి కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లాస్య నందితకు మద్దతుగా ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యుడు లోక్నాథ్,మార్కెట్ వైస్ చైర్మన్ వేణు గోపాల్ రెడ్డి,మాజీ చైర్మన్ ఖదీరవన్,వార్డు అధ్యక్షుడు కేజీ రవి కుమార్,జంగాల మురళీ యాదవ్,ఈఆర్ బాల్రాజు,ఎర్రోళ్ల గిరి,ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలను వివరిస్తూ…
మారేడ్పల్లి, నవంబర్ 8: కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందితకు మద్దతుగా బుధవారం జీహెచ్ఎంసీ మాజీ కో ఆప్షన్ సభ్యుడు సీఎన్ నర్సింహముదిరాజ్ ఆధ్వర్యంలో మోండా డివిజన్లోని రెజిమెంటల్ బజార్, పరికిబస్తీ, వసంత అపార్టుమెంట్, హిల్టన్ హోటల్ లైన్ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు బీఆర్ఎస్ నాయకులు, కార్య కర్తలు ప్రజలకు వివరిస్తూ…కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అశోక్ ముదిరాజ్ నీలాంకర్, సతీశ్, రామకృష్ణ, ప్రవీణ్, క్రిష్టోఫర్, సాయి కిరణ్, రాంపల్లి గోపి బాబు, కిరణ్ , బాబా, సందీప్, టింకు , పరుశరాం, వెంకటేశ్ , రాజు, నరేశ్ పాల్గొన్నారు.
మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట
కంటోన్మెంట్, నవంబర్ 8: మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేసినట్లు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి తెలిపారు. న్యూ బోయిన్పల్లిలోని పెన్షన్లైన్లో మంగళవారం రాత్రి మైనార్టీలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి మైనార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అనంతరం జక్కుల మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయన్నారు. మైనార్టీలను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని చెప్పారు. మైనార్టీల కోసం షాదీ ముబారక్, కుట్టుమిషన్ల పంపిణీ, మైనార్టీ రుణాలు, మైనార్టీ స్కూల్స్, ఓవర్సీస్ సాలర్షిప్స్, బక్రీద్, రంజాన్ సమయంలో కానుకలు, ఇఫ్తార్ విందు, ఇమామ్లకు రూ.5వేలు వంటి పథకాలు కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణదే అన్నారు. మత విద్వేషాలకు, మత రాజకీయాలకు తెలంగాణలో చోటు లేదన్నారు.
ఎన్నికల సమయంలో మైనార్టీల దగ్గరకు వచ్చే పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మైనార్టీల సంక్షేమానికి, భద్రతకు, అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రస్తుతం మైనార్టీలకు రూ.లక్ష రుణం పూర్తి సబ్సిడీతో అందింస్తున్నామన్నారు. నియోజకవర్గంలో ఉన్నత చదువు కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఇప్పటికే ఓవర్సీస్ స్కాలర్షిప్ అందించామని తెలిపారు. విద్య, వైద్యం, ఉద్యోగాల విషయంలో మైనార్టీలకు ఎల్లవేళలా అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటికే పెన్షన్లైన్ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరిగిందని, త్వరలోనే ఫైజాన్ స్కూల్ పక్కన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో హాసీన్, ఇర్ఫాన్, తారీఖ్, అజామ్, ఇంతియాజ్, ఇమ్రాన్, సుల్తాన్, అఫ్జల్ భాయ్, ఉబైద్, ఖాదర్ భాయ్, హానన్, అంజద్, ఆలీమ్, కలీం, ఫహద్, సాజీద్, హానీఫ్, జహీర్, సమీర్, ముక్తార్, ఆరీఫ్, ఇక్బాల్,అక్బర్ తదితరులు పాల్గొన్నారు.