కందుకూరు, డిసెంబర్ 28 : బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం హయాంలో ఫార్మా సిటీలో భూములు కోల్పోయిన రైతులకు అన్యాయం జరుగకుండా ముందు చూపుతో ఎకరానికి (గుంట) 121 గజాలను కేటాయించామని, ఇండ్ల స్థలాలను అమ్ముకోవొద్దని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్‌లు దూరదృష్టితో రైతులకు ఇంటి స్థలాలను ఇచ్చినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో భూములు కోల్పోయిన రైతులకు బేగర కంచెలోని కేటాయించిన ఇండ్ల స్థలాలను శనివారం సాయంత్రం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పాలనపై కాలయాపన చేస్తుందని విమర్శించారు.
ఫార్మా సిటీ ఏర్పాటు కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 14 వేల ఎకరాలకు పైగా రైతులను ఒప్పించి, మెప్పించి భూములను సేకరించినట్లు చెప్పారు. భూములు కోల్పోయిన రైతులకు అన్యాయం జరుగకుండా ఎకరాకు 121 గజాలలు ఇచ్చి హెచ్ఎండీఎ లేహౌట్ చేసి రైతులకు అప్పగించినట్లు తెలిపారు. రైతులు రోడ్డున పడకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఐదేండ్ల అనంతరం, అమ్ముకునే హక్కును కల్పించినట్లు తెలిపారు. కానీ, కొంత మంది అమయాక రైతులను మోసం చేసి ప్లాట్లను తక్కువ ధరకు రియల్ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని, వారి మోజులో పడవ్దని కోరారు. భవిష్యత్‌లో మంచి ధరలు వస్తాయని తెలిపారు. రైతులు ఎవరు ఇంటి స్థలాలను అమ్ముకోవొద్దని కోరారు.
ఆమె వెంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సురుసాని సురేందర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, మండల పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, వర్కింట్ ప్రసిడెంట్ ఎలుక మేఘనాథ్ రెడ్డి, సీనియర్ నాయకులు కాకి దశరథ ముదిరాజ్, గంగాపురం లక్ష్మీనర్సింహారెడ్డి, ప్రవీణ్ నాయక్, కాకి రాములు ముదిరాజ్, మాజీ సర్పంచ్‌లు తాండ్ర దేవేందర్, బుడ్డొలత్లత నరేందర్ గౌడ్, జంగయ్య, రాములు, డైరెక్టరు పొట్టి ఆనంద్, యూత్ నాయకులు బొక్క దీక్షిత్‌రెడ్డి, సురుసాని కొండల్ రెడ్డి, ఎగ్గిడి గణేశ్, భీమ్ నాయక్, మహిపాల్, తిరుపతయ్య, క్రిష్ణ, ఢిల్లీ గణేశ్‌లు ఉన్నారు.