సిటీబ్యూరో: విద్యుత్ బిల్లులు కొన్ని సందర్భాల్లో రెండు, మూడు రోజులు ఆలస్యంతో తీసిన రీడింగ్‌లపై అపోహలు వద్దని డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. విద్యుత్ వినియోగదారుల సమాచారం కోసం విద్యుత్ సంస్థ వెబ్సైట్ (www.tgsouthernpower.org) లో ఎనర్జీ చార్జ్ క్యాలుక్రేటర్ ఫర్ డొమెస్టిక్ సర్వీసును పొందుపరిచామని సీఎండీ తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ఎవరైనా సరే వెబ్సైట్లోకి వెళ్లి తమ మీటర్ నంబర్‌ను అందులో ఎంటర్ చేయడం ద్వారా ఎంత బిల్లు వస్తుందో తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు. డిస్కం పరిధిలో బిల్లులను 99.5 శాతం నెల రోజులకే ఇస్తుంటామని, అలా కానీ పక్షంలో వినియోగదారులు నష్టపోవద్దనే ఉద్దేశ్యంతో రీడింగ్ తీసిన రోజులతో సంబంధం లేకుండా కేవలం నెల రోజులకే బిల్లులు జారీ చేసేలా స్పాట్ బిల్లింగ్ యంత్రంలో ఏర్పాట్లు చేశామన్నారు.