హైదరాబాద్ : డ్రగ్స్ కట్టడికి నార్కోటిక్ పోలీసులు(Narcotics police) తగు చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతూ కేసులు నమోదు చేస్తున్నారు. డ్రగ్స్ డిటెక్టివ్(Drug detective) పరికరాలతో అనుమానితులకు(Drugs suspects) నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నారు. తాజాగా చేపట్టిన తనిఖీల్లో మాదాపూర్, గచ్చిబౌలి(Gachibowli) పబ్బుల్లో డ్రగ్స్ సేవిస్తూ డీజే సిద్ధార్థ్(DJ Siddharth) పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.
కొంత కాలంగా అతనిపై పోలీసులు నిఘా ఉంచారు. అతను ఎవరెవరిని కలుస్తున్నాడో వాళ్లందిరిని పిలిచి విచారించారు. కాగాచ, మొత్తంగా 16 మందికి టెస్టులు నిర్వహించగా.. 12 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు నిర్ధారించారు. అందులో డీజే సిద్దార్థ కూడా ఒకడు. వాళ్లందిరిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.