మల్కాజిగిరి, జనవరి 24: ఆడపిల్లల పెండ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని ప్రారంభించి, నిర్విరామంగా కొనసాగిస్తున్నారని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. ఈ మేరకు మంగళవారం మల్కాజిగిరి, ఆనంద్‌బాగ్‌లోని క్యాంప్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద ల బ్ధిదారులు 105జంటలకు ఒక్కొక్కరికి రూ.1,00,116 చొప్పన రూ.1.5కోట్లు, ఇంటర్ క్యాస్ట్ 6 జంటలకు రూ.2.50లక్షల చొప్పున, 30మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.18లక్షలు కలిపి మొత్తం రూ.1.38కోట్ల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద ఇప్పటికే చాలామంది లబ్ధి పొందారని, దరఖాస్తు చేసుకున్నవారికి కూడా త్వరగా చెక్కులు వస్తాయన్నారు. ఆడబిడ్డల పెండ్లికి ఇబ్బందులు పడకూడదనే ముఖ్యమంత్రి కేసీఆర్ ‘కల్యాణ లక్ష్మి-షాదీ ముబారక్’ పథకం కింద ఒక్కొక్కరికి రూ.1,00,116 ఆర్థిక సహాయం చేస్తున్నారని అన్నారు. ఈ పథకంలో దరఖాస్తు చేసుకున్న వెంటనే చెక్కులను అందజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి తాసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆర్ఐ వినిత, కార్పొరేటర్లు ప్రేమ్‌కుమార్, సునీతాయాదవ్, మీనారెడ్డి, క్యానం రాజ్యలక్ష్మి, సబితాకిశోర్, శాంతిశ్రీనివాస్‌రెడ్డి, రాజ్ జితేంద్రనాథ్, మాజీ కార్పొరేటర్ జగదీశ్‌గౌడ్, మీడియా ఇన్చార్జి గుండా నిరంజన్, శ్రీనివాస్, ఉపేందర్‌రెడ్డి, అనిల్‌కిశోర్, అమీనుద్దీన్, రాందాస్, బాబు, కన్నా, సూరి, కిట్టు, సత్తయ్య, నర్సింగ్‌రావు, సందీప్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.