సిటీబ్యూరో, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): మహానగరానికి తాగు నీరు సరఫరా చేసే మంజీరా ఫేస్-2లోని 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్‌కు రుద్రారం వద్ద భారీ లీకేజీ ఏర్పడింది. దీంతో తాగునీటి సరఫరాలో అంతరాయం తలెత్తింది. పనులను శనివారం మధ్యాహ్నం వరకు పూర్తిచేసి సరఫరా పునరుద్ధరిస్తారని అధికారులు తెలిపారు. ఈ కారణంగా బీరంగూడ, అమీన్పూర్, మియాపూర్, దీప్తిశ్రీనగర్, కేపీహెచ్‌బీ హౌసింగ్ బోర్డు, నిజాంపేట, హైదర్‌నగర్, మూసాపేట, ఎర్రగడ్డలో అంతరాయం ఉంటుందని చెప్పారు.