హైదరాబాద్ : వేతనాలు పెంచాలని ఆశా కార్యకర్తలు( Asha activists) ఆందోళన బాటపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వేతనం రూ.18 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ డీఎంఈ కార్యాలయం (DME office) ఎదుట బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ధర్నాకు(Dharna) దిగారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకోవాలన్నారు. చాలీచాలని జీతంతో ఆశాలు అనేక కష్టాలు పడుతున్నారని, పనిభారం తగ్గించి పెరిగిన రేట్లకు అనుగుణంగా వేతనాలు పెంచాలన్నారు. అలాగే పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు ఉద్యమిస్తామన్నారు.