బండ్లగూడ,జనవరి 17: సైబర్ ఆర్థిక నేరాలను అరికట్టేందుకు సైబర్ బిట్‌గా పోలీసులు పని చేయాలని రాష్ట్ర డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డీఎప్పీలకు శిక్షణలో భాగంగా శనివారం ఆయన విచ్చేసి వారిని ఉద్దేశించి మాట్లాడారు.30 సంవత్సరాల క్రితం ఉన్న పొలీస్లకు ఇ ప్పుడు ఉన్న పొలీసులకు చాలా వ్యత్యాసం ఉందన్నారు.
నాటి నుంచి నేటి వరకు పోలీస్ శాఖలో వచ్చిన మార్పులను వివరించారు.భారత దేశంలో తెలంగాణ పోలీస్ సైబర్,డ్రగ్స్ నేరాలను అరికటడ్డంలో రెండు వ్యవస్థల ద్వారా అత్యుత్తమంగా పని చేసి దేశంలో నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు.
సైబర్ సెక్యూరిటీ బ్యూరో,నార్కోటిక్ బ్యూరోలను ప్రతిష్టాత్మకంగా స్థాపించి భారత దేశంలోనే అత్యంత విలువైన తెలంగాణ పోలీస్‌గా అభివృద్ధి చెందిందన్నారు అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ ఆధ్వర్యంలో మంచి శిక్షణ తీసుకుని స్మార్ట్ పోలీసింగ్‌గా మారాలన్నారు. కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్ మధుకర్ స్వామి, డిప్యూటీ డైరెక్టర్లు కవిత,అసిస్టెంట్ డైరెక్టర్లు నరహరి,డీఎస్పీలు రామారావు,దేవారెడ్డి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.