దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. తొమ్మిది రోజులపాటు అమ్మవారు భక్తుల నుంచి విశేష పూజలందుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కొలువుదీరిన అమ్మవార్లను హుస్సేన్‌సాగర్‌తో పాటు పలు చెరువుల్లో నిమజ్జనం చేశారు.
భక్తులు పెద్ద ఎత్తున హాజరుకావడంతో ఆయా ప్రాంతాలు సందడిగా మారాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించారు.