బడంగ్‌పేట : తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ( KCR ) ద్వారానే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు నమ్మతున్నారన్నారని ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి ( MLA Sabhita Indra reddy) అన్నారు. కేసీఆర్ సహాకారంతో బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి పెద్ద పీట వేశామని పేర్కొన్నారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాయి నగర్ కాలనీలో సీసీ కెమెరాలను( CC Camera ) ఆమె ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానంగా, 24గంటలు నిఘా నేత్రంగా పనిచేస్తుందన్నారు. శాంతి భద్రతల విషయంలో సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగా నిందితులను పట్టుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు.తీర్పులను వెలువరించడానికి పుటేజీలు కీలకంగా మారుతున్నాయన్నారు. ప్రతి కాలనీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ముంపు ప్రాంతాల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న లక్ష్యంతో ఎస్ఎన్డీపీ నాలాలను ఏర్పాటు చేశామని వివరించారు. మహేశ్వరం నియోజక వర్గం అభివృద్ధికి కేసీఆర్ నాడు అన్ని మున్సిపాలిటీలకు రెండు వందల కోట్లు కెటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిధులను రద్దు చేసిందని విమర్శించారు. రద్దు చేసిన నిధులను ఇవ్వాలని ప్రభుత్వానికి ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పెద్ద బావి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రామిడి రాంరెడ్డి, పెద్ద బావి ఆనంద్ రెడ్డి, లిక్కి కృష్ణారెడ్డి, కాలనీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, ఏనుగు రామిరెడ్డి, గట్టు మైపాల్, సంతోష్ కుమార్, కర్రె బల్వంత్, శ్రీనివాస్, వెంకటేష్, యశ్వంత్, శంకర్, భాస్కర్ తదితరులు ఉన్నారు.