వెంగళరావునగర్ : కోట్లాది రూపాయలతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ అన్నారు.మంగళవారం ఎల్లారెడ్డిగూడలోని అంబేద్కర్ నగర్ కమ్యూనిటీహాలు పైన మరో అంతస్తు నిర్మాణానికి తన ఎమ్మెల్యే నిధులు రూ.20 లక్షలతో చేపట్టిన పనుల్ని సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్‌తో కలిసి ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఎల్లారెడ్డిగూడలోని అంబేద్కర్ నగర్ కమ్యూనిటీ హాలు నిర్మాణంతో పేదలు తమ ఫంక్షన్లు చేసుకోవడానికి అనువుగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్విరామంగా పని చేస్తున్నదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను తన నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా పార్టీ కార్యకర్తలు, నాయకులు నిర్విరామంగా కృషి చేస్తూ ప్రజల మన్ననలను పొందాలన్నారు. కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అద్యక్షుడు అప్పు ఖాన్, తన్ను ఖాన్,మధు యాదవ్,శరత్ గౌడ్,మారుతీ, నాగమణి,కవిత, అంబిక తదితరులు పాల్గొన్నారు.