అభివృద్ధి, సంక్షేమానికే ప్రాధాన్యం
అభివృద్ధి, సంక్షేమానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు.
- ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు
- మౌలాలి కృష్ణానగర్‌లో రూ.70లక్షలతో సీసీ రోడ్డు ప్రారంభం
గౌతంనగర్, జనవరి 21 : అభివృద్ధి, సంక్షేమానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం మౌలాలి డివిజన్, డాక్టర్ కృష్ణానగర్‌లో రూ.70లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి కట్టబడి ఉందన్నారు. అన్ని ప్రాం తాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేపడుతామని తెలిపారు. సమస్యలు ఏమైన ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, వెంటనే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే.. డాక్టర్ కృష్ణానగర్‌లో పర్యటించి.. సమస్యలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా స్థానికంగా మంచినీరు నాలుగు రోజులకు ఒకసారి వస్తుందని, దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతు న్నామని, ఇక నుంచి మంచినీరు రెండు రోజులకు ఒక సారి సరఫరా చేయాలని స్థానికులు ఎమ్మెల్యేను కోరారు. వెంటనే ఎమ్మెల్యే.. జలమండలి జీఎం సునీల్‌కుమార్‌తో ఫోన్లో చర్చించారు. 15 రోజుల్లోగా గాయత్రినగర్ రిజర్వాయర్‌కు ఇంటర్ లింక్ చేస్తామని, అప్పటి నుంచి రెండు రోజులకు ఒకసారి మంచినీరు సరఫరా చేస్తామని జీఎం ఎమ్మెల్యేకు వివరించారు. తాగు నీటి సమస్య, కరెంట్ సమస్యలు ఏమైన ఉంటే తక్షణమే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అన్నారు.
ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి సర్కిల్ మున్సిపల్ ఈఈ లక్ష్మణ్, డీఈ మహేశ్, ఏఈ మధురిమ, బీఆర్ఎస్ నాయకులు అమీనొద్దీన్, జీఎన్వీ సతీశ్‌కుమార్, పిట్ల శ్రీనివాస్, మేకల రాముయాదవ్, మౌలాలి డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు సత్తయ్య, భరత్‌నగర్ అసోసియేషన్ అధ్యక్షుడు మంద భాస్కర్, వేంకటేశ్వరనగర్ కాలనీ అధ్యక్షుడు బుద్ధి నర్సింగ్‌రావు, ఇబ్ర హీం, ఆదినారాయణ, సంతోష్ నాయుడు, సంతోశ్‌గుప్తా, చందు, గౌలికార్ దినేశ్, షకీల్, నవాబ్, ఫైజల్, సమీర్, ఇర్ఫాన్, జోగు శ్రీనివాస్, మైమూదాబేగం, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

