సుల్తాన్‌బజార్, సెప్టెంబర్ 11 : వరుసగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు డెంగ్యూ ఫీవర్ బారిన పడకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కింగ్‌కోఠి క్లస్టర్ పరిధిలోని ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. క్లస్టర్ పరిధిలోని ఎస్పీహెచ్వో డాక్టర్ పద్మజ నేతృత్వంలో జీహెచ్ఎంసీ అధికారులు, ఎంటమాలజీ విభాగం సిబ్బందితో కలిసి కింగ్‌కోఠి క్లస్టర్ పరిధిలో ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారు. ప్రధానంగా జ్వరం, జలుబు, దగ్గు,డెంగ్యూ లక్షణాలు ఏమైనా ఉంటే కోలుకోవడానికి మెడికల్ కిట్లను అందజేస్తున్నారు. డెంగ్యూ ఫీవర్ లక్షణాలు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రతి రెండు రోజులకు ఒకసారి డెంగ్యూ బారిన పడిన వారి ఇండ్ల వద్దకు వెళ్లి రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారికి తగిన మందులను అందజేస్తున్నారు. జాగ్రత్తలను పాటిస్తే డెంగ్యూను కట్టడి చేసేందుకు అవకాశం ఉందని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ పద్మజ పేర్కొన్నారు. ప్రతి యూపీహెచ్ పరిధిలో ఓ వైపు ఫీవర్ సర్వేతో పాటు కరోనా నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఆమె వివరించారు.
కింగ్‌కోఠి క్లస్టర్ పరిధిలో ఇంటింటా సర్వే..
కురుస్తున్న వర్షాలతో పాటు డెంగ్యూ ఫీవర్‌ను కట్టడి చేసేందుకు గాను ప్రభుత్వం ఇంటింటా ఫీవర్ సర్వే ప్రవేశ పెట్టింది. కింగ్‌కోఠి క్లస్టర్ పరిధిలో జీహెచ్ఎంసీ అధికారులు, ఎ ంటమాలజీ విభాగంతో కలిసి డెంగ్యూ ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారు. డెంగ్యూ బారిన పడిన ప్రాంతాలను గుర్తించి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారు. రోగులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పరిశుభ్రతా చర్యలు చేపట్టారు. క్లస్టర్ పరిధిలోని బొగ్గులకుంట, సుల్తాన్‌బజార్, ఇసామియా బజార్, ఆగాపురా, శాంతినగర్, బేగంబజార్ యూపీహెచ్‌సీల్లో సర్వే కొనసాగుతోంది.
ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి
డెంగ్యూ ఫీవర్‌తో ప్రమాదం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. దాంతో ఫీవర్‌ను కట్టడి చేయవచ్చు. సర్వేలో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తున్నాం. దోమలు వృద్ధి చెందకుండా ఎంటమాలజీ విభాగం సిబ్బందితో రసాయనాల పిచికారీ చేపడుతున్నాం. జ్వరం,జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారిని గుర్తించి మెడికల్ కిట్లను అందజేస్తున్నాం. డెంగ్యూ బారిన పడిన రోగులకు రెండు రోజుల కొకసారి రక్త పరీక్ష నిర్వహించిన ప్లేట్సెల్స్ను గుర్తించి మందులను అందజేస్తున్నాం.
– డాక్టర్ పద్మజ,కింగ్ కోఠి క్లస్టర్, ఎస్పీహెచ్వో