హైదరాబాద్: నగరంలోని ముషీరాబాద్‌లో (Musheerabad) ఇండ్ల కూల్చివేతతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. గాంధీనగర్ డివిజన్లోని స్వామి వివేకానంద నగర్లో దళితులకు సంబంధించిన ఇండ్లను జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం ఉదయం కూల్చివేశారు. దీంతో తాము 70 ఏండ్ల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నామని అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా, విషయం తెలుసుకున్న స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఆయనను అడ్డుకున్న పోలీసులు అక్కడి నుంచి పంపించివేశారు. కార్పొరేటర్ సుప్రియ భర్త నవీన్, బీజేపీ నేతలను అరెస్టు చేశారు. అయితే బాధితులకు ధరణి విచారణ కమిటీ చైర్మన్ కోదండ రెడ్డి మద్దతు తెలపడం విశేషం.