Hyderabad | స్కూటీని ఢీకొట్టి.. 5 కిలోమీటర్లు లాక్కెళ్లిన డీసీఎం.. మాదాపూర్ యాక్సిడెంట్ వీడియో వైరల్
Hyderabad | హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఓ డీసీఎం వాహనం బీభత్సం సృష్టించింది. ఓ స్కూటీని ఢీకొట్టి 5కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
Hyderabad | హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఓ డీసీఎం వాహనం బీభత్సం సృష్టించింది. ఓ స్కూటీని ఢీకొట్టి 5కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన హనియ్యా ఆయేషా (22), అబ్దుల్ బాసిత్ దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చారు. ఇక్కడే మహేశ్వరం సమీపంలో ఉంటూ మలబార్ జువెల్లరీ షాపులో పనిచేసుకుంటున్నారు. శనివారం సాయంత్రం ఎప్పటిలాగే విధులు పూర్తి చేసుకున్న దంపతులు.. చిన్న షాపింగ్ చేసుకుని ఇంటికి బయల్దేరారు. ఈ క్రమంలో మాదాపూర్ మైండ్ స్పేస్ సమీపంలో వారి స్కూటీని ఓ డీసీఎం ఢీకొట్టింది.
స్కూటీ టైర్ల కింద ఈడ్చుకుంటూ వస్తున్నా డీసీఎం వ్యాన్‌ను ఆపలేదు. అలా ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత స్థానికులు గమనించి డీసీఎంను అడ్డుకున్నారు. దీంతో డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. క్లీనర్‌ను స్థానికులు పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
కాగా, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దంపతులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయేషా మృతిచెందినట్లుగా వైద్యులు తెలిపారు. అబ్దుల్ బాసిత్ పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆయేషా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
షాకింగ్ వీడియో
మాదాపూర్ లో స్కూటీని ఢీకొట్టి 5 కిలోమీటర్లు లాక్కెళ్లిన డీసీఎం
స్కూటీపై వెళ్తున్న అయేషా(22), అబ్దుల్ బాసిత్ అనే దంపతులను ఢీకొట్టి దాదాపు 5 కిలోమీటర్లు లాక్కెళ్లిన డీసీఎం
జూబ్లీహిల్స్ వద్ద డీసీఎంను అడ్డుకుని, క్లీనర్‌ను పోలీసులకు అప్పగించిన యువకులు
డ్రైవర్… pic.twitter.com/djM7KFdcK4
— Telugu Scribe (@TeluguScribe) April 5, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

