Hyderabad | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఎండలు మండిపోతున్నాయి. ఎండాకాలం మాదిరి ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో నగర ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాత్రి అయిందంటే చాలు తీవ్రమైన వేడి కారణంగా.. ఎండాకాలంను తలపిస్తోంది.
సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 32.6 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 22.8 డిగ్రీలు, గాలిలో తేమ 57 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అనూహ్యంగా పెరిగిన ఉష్ణోగ్రతలతో మరోసారి ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇదిలా ఉండగా బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాగల 2 రోజుల్లో గ్రేటర్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారి వర్షం కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.