హైదరాబాద్ : హైదరాబాద్ వ్యాప్తంగా గత ఐదారు రోజుల నుంచి కుండపోత వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. త్వరగా తమ గమ్యస్థానాలకు, కార్యాలయాలకు వెళ్లేందుకు హైదరాబాదీలు.. మెట్రో ప్రయాణం వైపు మళ్లారు.
ఐదారు రోజుల నుంచి ఎడతెరిపి లేని వర్షాలతో మెట్రో రైలు ప్రయాణికుల సంఖ్య పెరిగింది. రోజుకు మూడున్నర లక్షల మంది వరకు మెట్రో రైళ్లల్లో ప్రయాణిస్తున్నారు. మూడు కారిడార్లలో ప్రయాణికులతో మెట్రో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. కరోనాకు ముందు వరకు రోజుకు 4 లక్షల మంది మెట్రో రైళ్లల్లో ప్రయాణించేవారు.