బంజారాహిల్స్: సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆదివారం ఫిలిం చాంబర్ నుంచి కేబీఆర్ పార్కు దాకా ‘సైబర్ దొంగలున్నారు.. తస్మాత్ జాగ్రత్త’ పేరుతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
త్వరలో విడుదల కానున్న ‘తకిట తదిమి తందాన’ చిత్ర యూనిట్, హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ర్యాలీని సినీ నిర్మాత బెక్కం వేణుగోపాల్, దర్శకుడు చంద్రమహేశ్, హీరో రాంకీతో పాటు ఫెటాప్సీ చైర్మన్ హరిగోవింద ప్రసాద్ ప్రారంభించారు. ర్యాలీలో భాగంగా సైబర్ నేరాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఫిలిం చాంబర్, అపోలో చౌరస్తా, జగన్నాథ స్వామి ఆలయం, కేబీఆర్ పార్కు మీదుగా సైకిల్ ర్యాలీ కొనసాగింది.