సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): పార్ట్‌టైమ్ వర్క్‌ఫ్రమ్ హోమ్ అఫర్ ఇస్తున్నామంటూ ఒక ప్రైవేట్ ఉద్యోగికి సైబర్‌నేరగాళ్లు రూ. 6.3 లక్షలు టోకరా వేశారు. వనస్థలిపురానికి చెందిన ఒక ప్రైవేట్ ఉద్యోగికి వాట్సాప్ నుంచి ఒక మేసేజ్ వచ్చింది, ‘గుడ్ గయ్స్ కంపెనీ వర్క్‌ఫ్రమ్ హోమ్ జాబ్ అఫర్స్ ఇస్తుంది. ఏ సమయంలోనైనా మీరు వర్క్ చేమొచ్చు’ అందులో సారాంశముంది. అందులో ఉన్న నంబర్‌కు బాధితుడు ఫోన్ చేయడంతో ప్రియ అనే పేరుతో ఒక మహిళ మాట్లాడింది. గుడ్గయ్స్ కంపెనీ నుంచి అకౌంట్ క్రియేట్ చేసి రోజుకు రూ. 1000 నుంచి రూ. 3 వేలు సంపాదించేలా పని ఇస్తామని పేర్కొన్నారు.
ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను విక్రయించడమే పనంటూ.. సూచించారు. మొదటగా రూ.10 వేల బోనస్ ఆఫర్ ఇస్తున్నామని, దానిని విక్రయిస్తే రూ.1220 లాభం వచ్చే విధంగా చేశారు. రూ.1220 బాధితుడి ఖాతాలో డిపాజిట్ చేయడంతో అదంతా నిజమని నమ్ముతూ దఫ దఫాలుగా రూ. 6,45,107 పెట్టుబడి పెట్టాడు. అయితే అందులో అతనికి రూ. 15,120 మాత్రమే తిరిగి వచ్చాయి, మిగతా రూ. 6,29,987 మోసపోవడంతో బాధితుడు ఎల్బీనగర్లోని రాచకొండ సైబర్‌క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.