హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోమ్ (Work From Home) ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు ఐటీ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. శుక్ర, శనివారాల్లో హైదరాబాద్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే గురువారం రాత్రి నుంచి హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఐటీ పరిశ్రమలు అత్యధికంగా ఉన్న సైబరాబాద్ పరిధిలోని గచ్చిబౌలి, కొండాపూర్, కోకాపేట్, నానక్‌రామ్‌గూడలో సాధారణ రోజుల్లోనే భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక వర్షాలు కురిస్తే పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఈ నేపథ్యంలో ట్రాఫిక్ చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని, ఉద్యోగులను ఇంటి నుంచే పనులు చేసేందుకు అనుమతిస్తే ఊరట ఉంటుందని సైబరాబాద్ పోలీసులు కోరారు. దూర ప్రయాణాలకు బదులు ఈ వెసులుబాటు కల్పించాలని సూచించారు.
— Cyberabad Traffic Police (@CYBTRAFFIC) September 26, 2025