Cyberabad | హైదరాబాద్ : సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పోలీసులు శనివారం రాత్రి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 238 మంది మందుబాబులను అరెస్టు చేశారు. ఇందులో 187 మంది బైక్ రైడర్లు, ముగ్గురు ఆటో డ్రైవర్లు, 45 మంది కారు డ్రైవర్లు ఉన్నట్లు తెలిపారు.
అరెస్టు అయిన వారిలో 83 మంది 31 నుంచి 40 ఏండ్ల మధ్య వయసు ఉన్న వారేనని పోలీసులు పేర్కొన్నారు. 21 నుంచి 30 ఏండ్ల మధ్య వయసున్న వారు 78 మంది ఉన్నారు. 12 మంది మాత్రం 51 ఏండ్లకు పైబడిన వారు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇక చేవెళ్ల పోలీసులు 27 మందిని, మియాపూర్ పోలీసులు 24 మంది, బాలానగర్ పరిధిలో 20 మంది మందుబాబులు అరెస్టు అయ్యారు.