Crime News | సిటీబ్యూరో: తమ కంపెనీలో పెట్టుబడిపెడితే అధిక రాబడి వస్తుందని నమ్మించి అమాయకుల వద్ద నుంచి రూ. 1.02 కోట్లు వసూళ్లు చేసి, బిచాణా ఎత్తేసిన ఇద్దరు మోసగాళ్లను సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ ప్రసాద్ కథనం ప్రకారం..
గోపన్పల్లికి చెందిన చంద్రశేఖర్, సునీత దంపతులు. మాదాపూర్లో అమెకాన్ డెవలపర్స్ పేరుతో రియల్ఎస్టేట్ కంపెనీ ప్రారంభించారు. తమ కంపెనీలో 13 నెలల కాలపరిమితితో పెట్టుబడి పెడితే వారికి అధిక రాబడి చెల్లిస్తామని నమ్మించి పలువురిని మోసం చేశారు. బాధితులు ఫిర్యాదు చేయగా.. నిందితులిద్దరినీ బుధవారం పోలీసులు అరెస్టు చేశారు.