ఐటీ సాక్షీగా.. వ్యర్థాల గుట్టలు
ఐటీ భవనాలు.. కార్పొరేట్ దిగ్గజాల ఆఫీసులు.. లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలు నిత్యం లక్షలాది మంది సాఫ్ట్వేర్ ఉద్యోగుల కోలాహలం. కానీ, అదే హైటెక్ సిటీ సాక్షిగా గుట్టను తలపించేలా.. నిర్మాణ వ్యర్థాల డంపింగ్ సీఎంసీకు పెద్ద సవాల్‌గా మారింది. సుమారు 13 ఎకరాల ప్రభుత్వ స్థలంలో.. ఐదారు అంతస్తుల భవనమంత ఎత్తున పేరుకుపోయి పోగైన దాదాపు 15 లక్షల మెట్రిక్ టన్నుల నిర్మాణ వ్యర్థాలు ఉకిరిబికిరి చేస్తున్నది.
- నిర్మాణ వ్యర్థాల డంపింగ్
- శాస్త్రీయ పద్ధతిలో డిస్పోజ్ చేయాలంటే రూ.95 కోట్ల వరకు ఖర్చు
- హైటెక్ సిటీ ప్రతిష్టను మసకబారుస్తున్న డెబ్రిస్
- నిర్మాణ వ్యర్థాలకు సరికొత్త అర్థమిచ్చిన బీఆర్ఎస్
- రీసైక్లింగ్ ప్లాంట్ల ఏర్పాటు
- సిమెంట్ ఇటుకలు, కంకర తయారీ
ఐటీ భవనాలు.. కార్పొరేట్ దిగ్గజాల ఆఫీసులు.. లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలు నిత్యం లక్షలాది మంది సాఫ్ట్వేర్ ఉద్యోగుల కోలాహలం. కానీ, అదే హైటెక్ సిటీ సాక్షిగా గుట్టను తలపించేలా.. నిర్మాణ వ్యర్థాల డంపింగ్ సీఎంసీకు పెద్ద సవాల్‌గా మారింది. సుమారు 13 ఎకరాల ప్రభుత్వ స్థలంలో.. ఐదారు అంతస్తుల భవనమంత ఎత్తున పేరుకుపోయి పోగైన దాదాపు 15 లక్షల మెట్రిక్ టన్నుల నిర్మాణ వ్యర్థాలు ఉకిరిబికిరి చేస్తున్నది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో జరిగిన భారీ నిర్మాణ పనుల నుంచి వెలువడిన వ్యర్థాలను ఇకడే అక్రమంగా పారబోయడంతో ఇప్పుడది పెద్ద గుట్టలా తయారైంది. కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వం కన్స్టక్షన్స్ అండ్ డిమాలిషన్ ప్లాంట్లు ఏర్పాటు చేసి.. నిర్మాణ వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసి.. అద్భుత ఫలితాలను రాబట్టింది. ఈ ప్లాంట్ల ద్వారా సిమెంట్ ఇటుకలు, టైల్స్ ఇసుక, కంకర ఇతరాత్ర పరికరాలు తయారు చేయడం గమనార్హం. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిర్మాణ వ్యర్థాల సమస్యను పరిష్కరించడంలోతలలుపట్టుకుంటున్నది. పెద్ద మొత్తంలో ఖర్చుతో కూడుకున్న ఈ డెబ్రిస్ కుప్పలను ఎలా తొలగిస్తారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకమైంది.

సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ): ఐటీ హబ్‌లో వెలిసిన ఈ వ్యర్థాల కొండలపై స్థానికుల నుంచి నిరసనలు వ్యక్తమవడంతో ఇటీవల సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజనతో పాటు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఈ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కొండంత చెత్తను క్లియర్ చేయడం అధికారుల ఊహకు అందలేదు.. ఈ సమస్య పరిషారానికి అధికారులు రెండు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు. మొత్తం వ్యర్థాలను దుండిగల్ సమీపంలోని సీ అండ్ డీ ప్లాంట్‌కు తరలించి శాస్త్రీయ పద్ధతిలో డిస్పోజ్ చేయాలంటే రూ.90 నుంచి రూ.95 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు.
దాదాపు రెండేళ్ల సమయం పడుతుందని చెబుతున్నారు. నిత్యం వందలాది భారీ లారీలు ఐటీ కారిడార్ గుండా ప్రయాణిస్తే ట్రాఫిక్ మరింత స్తంభించే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. మరోవైపు, ఇకడే ప్రత్యేక డిస్పోజల్ ప్లాంట్ ఏర్పాటు చేసి వ్యర్థాలను ప్రాసెస్ చేయాలన్న ఆలోచన కూడా పరిశీలనలో ఉంది. వ్యర్థాలు ఉన్న చోటే తాతాలికంగా ఒక డిస్పోజల్ ప్లాంట్ ఏర్పాటు చేసి రీసైక్లింగ్ (క్రషింగ్) చేయడం చేస్తే వాహనాల పొగతో ఉకిరిబికిరి అవుతున్న ఈ ఐటీ హబ్ లో క్రషింగ్ ప్లాంట్ పెడితే, గాలిలో ధూళి కణాలు (పీఎం 2.5, పీఎం 10) పెరిగి వాయు కాలుష్యం తీవ్ర రూపం దాల్చుతుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో పాటు గాలి దుమారాలు, వర్షాల సమయంలో చెత్త, ధూళి చుట్టుపకల కాలనీలు, రోడ్లపైకి ఎగిరిపడుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. మొదటి నుంచే అక్రమ డంపింగ్ అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారని వారు విమర్శలు లేకపోలేదు .
తోడైన కోర్టు వివాదం..
కాగా ఈ 13 ఎకరాల భూమి యాజమాన్యంపై ప్రభుత్వం, ప్రైవేట్ వ్యక్తుల మధ్య కోర్టులో వివాదం కొనసాగుతుండటం కూడా సమస్య పరిషారాన్ని క్లిష్టతరం చేస్తున్నది. భూమి ఎవరిదో తేలకపోవడం, న్యాయపరమైన చికులు ఉండటంతో తక్షణమే అకడ శాశ్వత చర్యలు చేపట్టేందుకు మున్సిపల్ యంత్రాంగం ముందడుగు వేయడం లేదు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

