హైదరాబాద్ : అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో(Attapur police station) సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి (Avinash Mahanthy) ఆకస్మిక తనిఖీ చేపట్టారు. స్టేషన్‌లోని ఫైల్స్‌ను పరిశీలించారు. పెండింగ్ కేసులపై ఆరా తీశారు. డ్రగ్స్, గంజాయి విక్రయాలపై సీరియస్‌గా దృష్టిపెట్టాలని, కమిషనరేట్ పరిధిలో ఇదే అత్యంత సీరియస్ సమస్యగా మారుతోందదన్నారు. అందరూ సీరియస్‌గా పనిచేయాలని, అనుమానిత ప్రాంతాలు, వ్యక్తులపై నిఘా వేసి ఉంచాలని పోలీసులను ఆదేశించారు. కేసుల దర్యాప్తు ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్‌లో ఉండొద్దన్నారు. ఏదైనా సమస్య ఉంటే నేరుగా తనకు వివరించాలని ఆదేశించారు.