Cyber Crime | సిటీబ్యూరో, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): షేర్మార్కెట్లో పేరున్న షేర్‌ఖాన్ పేరు వాడేస్తున్నారు.. రుణం ఇస్తామంటూ రుణం ఇచ్చినట్లు నటిస్తున్నారు.. తీరా ఆ రుణం తిరిగి చెల్లించిన త రువాతే నీ లాభాలు నీవు తీసుకోవాలంటూ షర తు విధిస్తూ సైబర్‌నేరగాళ్లు సరికొత్త రీతిలో సైబర్ దోపిడీకి పాల్పడుతున్నారు. షేర్‌ఖాన్ కంపెనీ మరో కంపెనీలో కలిసిపోయిందనే విషయం బాధితుడు తెలుసుకోలేకపోయాడు.
కొత్తపేట్‌కు చెందిన ఒక ప్రైవేట్ ఉద్యోగి షేర్‌ఖాన్ కంపెనీ అనే భావనతో సైబర్‌నేరగాళ్ల చేతికి చిక్కి రూ. 1.85 కోట్లు పోగొట్టుకున్నాడు. ఇన్స్టాగ్రామ్ బ్రౌజ్ చేస్తుండగా ప్రైవేట్ ఉద్యోగికి షేర్ఖా న్ ఎడ్జ్ యాప్(ఎస్కేహెచ్ పీఆర్ఓ) పేరుతో ఉం ది. దీంతో ఆ లింక్‌ను క్లిక్ చేయడంతోనే వాట్సాప్ నంబర్‌కు లింక్ అయ్యింది. ఆ వాట్సాప్ గ్రూప్‌లో ఎస్కేహెచ్ పీఆర్ఓ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని ఐపీఓ అండ్ స్టాక్స్ క్లయిమ్ చేసుకోవాలని, స్టాక్స్ విశ్లేషణ తదితర అంశాలు ఫ్రీగా అందిస్తామంటూ సూచనలు చేశారు.
ఇంతలో చీఫ్ ట్రేడింగ్ అనాలసిస్ట్ మనోజ్ జోషిని మాట్లాడుతున్నానను .. నేను షేర్‌ఖాన్ ఎడ్జి(ఎస్కేహెచ్ పీఆర్ఓ) యజమానిని అంటూ ఫోన్లో మాట్లాడాడు. స్టాక్ బ్రోకింగ్ కంపెనీ య జమానే తనతో మాట్లాడుతున్నాడనే భ్రమలో బాధితుడున్నాడు. ఆ తరువాత ఆ సంస్థ ఫైనాన్సియల్ అడ్వైజర్ ముక్త బల్వంత్ కాంబ్లి పేరుతో వాట్సాప్‌లో చాట్ చేస్తూ మీరు కొంత డబ్బు ఇన్వె స్ట్ చేయండి ఆ తర్వాత లాభాలు రాకపోతే మీ డబ్బు మీరు వాపస్ తీసుకోండి అంటూ సూచనలు చేయడంతో ఈ ఏడాది జనవరిలో రూ. 50 వేలు బాధితుడు పెట్టుబడి పెట్టాడు. సెంట్రల్ డి పాజిటరీ టీమ్ పేరుతో బాధితుడికి ఫోన్ వచ్చింది. మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు తమ వద్దకు వచ్చాయని మీరు , మీ ఖాతా ప్రారంభమయ్యింది, కేవైసీ అప్డేట్ అయ్యిందంటూ సూచించారు.
ఆ తర్వాత మీరు ఐపీఓల మీద పెట్టుబడులు పెట్టండి.. మీకిచ్చిన యాప్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉంటాయంటూ సూచనలు చేశారు. ఇలా ఐపీఓలపై మీరు పెట్టుబడి పెడితే భారీ లాభాలొస్తాయని, మీరు పెట్టుబడి పెట్టే దానిపై మీ లాభాలలో పెరుగుదల ఉంటుందంటూ సైబర్‌నేరగాళ్లు మాట్లాడారు. ఇలా దఫ దఫాలుగా రూ. 50 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఆ తరువాత కోటి రూపాయల వరకు పెట్టుబడి పెడితే హెచ్ఎన్1 అకౌంట్ ఓపెన్ అవుతుందని, దాంతో మీరు మరి న్ని లాభాలు పొందేందకు వీలుంటుందంటూ సూచనలు చేశారు. దీంతో తన వద్ద ఒకేసారి కోటి రూపాయలు లేవని, రూ. 30 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అయితే మీ స్లాట్ వర్త్ మొత్తం రూ. 1.85 కోట్లు అవుతుందని, ఇంకా మీరు రూ. 1.05 కోట్లు పెట్టుబడి పెడితే ఒకేసారి భారీగా మీ రు సంపాదించవచ్చంటూ నమ్మించారు.
తన వద్ద అంత డబ్బు లేదని బాధితుడు చెప్పినా, మీకు ఆ మొత్తం లోన్ వస్తుందని నెమ్మదిగా ఆ రుణం తీర్చవచ్చంటూ సైబర్‌నేరగాళ్లు సూచించా రు. షేర్‌ఖాన్ కంపెనీ లోన్ ఇస్తామంటే వద్దంటనా అనే ఉద్దేశ్యంతో బాధితుడు రుణం తీసుకునేందుకు సై అన్నాడు. మరుసటి రోజు మీ పేరుపై రుణం మంజూరయ్యిందని రూ. 1.05 కోట్ల రు ణం కంపెనీ ఇస్తుందని, ఇప్పటి వరకు మీ పూర్తి స్టాక్స్ విలువ రూ. 80 లక్షలు ఉన్నాయి, రుణం మంజూరైన తరువాత దాని విలువ రూ. 1.85 కో ట్లంటూ సైబర్‌నేరగాళ్లు సూచించారు. అంతా నిజమని బాధితుడు నమ్మాడు.
యాప్‌లో స్కీన్ప్రై ఐపీఓలు తీసుకున్నట్లు దాని విలువ రూ. 4 కోట్లు ఉన్నట్లు కన్పిస్తోంది. దీంతో అందులో కొంత మొత్తం విత్‌డ్రా చేసుకోవడానికి బాధితుడు ప్రయత్నించాడు. వెంటనే కస్టమర్ కేర్ అంటూ బాధితుడు ఫోన్ వచ్చింది. మీ పేరుపై రుణం ఉంది, ఆ రుణం తిరిగి చెల్లించిన తరువాతే మీకు అందులో ఉన్న డబ్బును విత్ డ్రా చేసుకునేందుకు వీలు కల్గుతుందంటూ నమ్మించారు.
అది నిజమని నమ్మిన బాధితుడు దఫ దఫాలుగా రూ. 1.05 కోట్ల రుణాన్ని సైబర్‌నేరగాళ్లకు సూచించిన బ్యాం కు ఖాతాల్లో డిపాజిట్ చేస్తూ వెళ్లాడు. అంత రుణం పూర్తయిన తరువాత విత్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నించాడు. మీరు ఇప్పుడే డ్రా చేయలేరు, మొత్తం డబ్బుపై 10 శాతం కమీషన్ చెల్లించాలని అంటే రూ. 40 లక్షల వరకు చెల్లించాలం టూ మరోసారి ఒత్తిడి చేశారు. ఇలా డ్రా చేసుకోవాలంటే కమీషన్లు అడగడంతో బాధితుడికి అనుమానం వచ్చి రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.