Cyber Crime | సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలొస్తాయని నమ్మించిన సైబర్‌నేరగాళ్లు ఒక డెంటల్ టెక్నీషియన్‌కు రూ. 7 లక్షలు టోకరా వేశారు. బాలాపూర్, ఎర్రకుంటకు చెందిన బాధితుడి వాట్సాఫ్‌కు గుర్తుతెలియని నెంబర్ నుంచి స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన ఒక మేసేజ్ వచ్చింది. ఆ తరువాత హెచ్ 1111-ఎస్ ఫేస్ 7 లే అవుట్ వాట్సాఫ్ గ్రూప్‌లో చేరాలంటూ సూచించడంతో బాధితుడు అందులో చేరా డు.
అందులో స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే లాభాలు ఎలా వస్తున్నాయనే విషయంపై పలువురు చర్చించుకుంటూ మాకు లాభాలొచ్చాయి, మాకు వచ్చాయంటూ డిస్కస్ చేశారు. ఇంతలోనే నియతి కండెల్వాల్ పేరుతో ‘ఎస్ సెక్యూరిటీస్ ప్రైవేట్ గ్రూప్-5158’ అనే మరో గ్రూప్‌లోకి బాధితుడిని అహ్వానించారు. అక్కడ స్పెషల్‌గా ఏ కంపెనీలో పెట్టుబడి పెడితే ఎంత లాభాం వస్తుంది. సెబీ రిజిస్టార్ కంపెనీల గూర్చి వివరించడంతో బాధితుడు వాళ్లు చెప్పే మాట లు నమ్మాడు.
దీంతో ఒక యాప్‌ను డౌన్లోడ్ చేయించి, దాని ద్వారా మొదట కొంత డబ్బు ఇన్వెస్ట్ చేయించారు, మొదట కొన్ని లాభాలు చూపించారు. ఆ తరువాత నమ్మ కం కుదిరిన తరువాత ఐపీఓలలో పెట్టుబడులు పెట్టాడు. బాధితుడు అప్పటికే రూ.7 లక్షలు పెట్టుబడి పెట్టాడు, వచ్చిన లాభాలు విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించడంతో, 20 శాతం కమిషన్ చెల్లిస్తేనే పెట్టిన పెట్టుబడి, లాభాలు విత్ డ్రా చేసుకునే అవకాశముంటుందని సైబర్‌నేరగాళ్లు చెప్పారు. దీంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేపట్టారు.