సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ): ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించారంటూ వెంటనే చలాన్ కట్టాలని ఏపీకే ఫైల్ పంపి డబ్బులు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. నగరానికి చెందిన రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్‌కు ఈ నెల 6వ తేదీన వాట్సాప్‌లో ఈ-పరివాహన్.ఏపీకే పేరుతో మెసేజ్ వచ్చింది. తాము అధికారిక ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ నుంచి ఈ మెసేజ్ పంపిస్తున్నామని చెప్పి బాధితుడి కారు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినట్లుగా నమోదైందని వెంటనే రూ.1000 ఫైన్ కట్టాలని చెప్పారు.
నమ్మిన బాధితుడు వెంటనే ఏపీకే ఫైల్‌ను ఇన్స్టాల్ చేసుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే తన ఎస్బీఐ క్రెడిట్ కార్డ్నుంచి రెండుసార్లు అమెజాన్ సైట్లో అనధికారికంగా లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. దీంతో అతడు రూ.1,20,409 లక్షలు కోల్పోయినట్లు గ్రహించి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.