Cyber Crime | సిటీబ్యూరో, మార్చ్ 7(నమస్తే తెలంగాణ): లాభాలు ఇప్పిస్తామంటూ.. పెట్టుబడి పెట్టించి.. రూ.87,51,400 లక్షలు కొట్టేసిన సైబర్ నెరగాళ్లలో ఒకరిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పో లీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీ లో ఉన్నాడు. వివరాల్లోకి వెళ్తే.. గత సంవత్సరం నవంబర్‌లో హైదరాబాద్‌లో ఉన్న ఒక వ్యక్తి నుంచి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు వచ్చిం ది. బాధితుడికి తెలియకుండానే నేరుగా ఎం 56 ఫైనాన్షియల్ వాట్సప్ గ్రూపులో చేర్చబడడంతో పాటు విశ్వనాథన్ అనే పేరుతో ఒక వ్యక్తి తనను జేపీ మోర్గాన్ చేజ్ ప్లానింగ్ ఆఫీసర్‌గా పరిచ యంచేసుకొని రోజువారీ లాభాలు వస్తాయంటూ పెట్టుబడి పెట్టడానికి ఒప్పించాడు.
వారి మాటలు నమ్మిన బాధితుడు మొదట కొద్ది మొత్తంలో పెట్టుబడి పె ట్టాడు. ఆ తర్వాత ఎక్కువ లాభాల కోసం ఇండియన్ పోస్టల్ ఆర్డర్ కొనుగోలు చేయాలంటూ బాధితుడిని మరోసారి ఒప్పించగా.. రూ.87,51, 400 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత అతను ఎన్నిసార్లు ప్రయత్నించినా స్పందించకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. నిందితులు సూరత్‌కు చెందిన సవలియా రవి, అహ్మదాబాద్‌కు చెందిన కిషన్‌లు నకిలీ గుర్తింపులతో బ్యాంక్ ఖాతాలను తెరిచారు.
క మీషన్ ఆధారంగా నే పాల్,చైనాలోని సైబర్ నేరగాళ్లకు అదే బ్యాంక్ ఖా తాలను అందించారు. ప్రత్యేకించి హైదరాబాద్ కేసులో నిందితుడు ఎంఎస్ లుక్స్ అండ్ లైక్స్ పేరుతో ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతా తెరిచాడు. లాగిన్ ఆధారాలను టెలిగ్రామ్ ద్వారా సైబర్ మోసగాళ్లతో పంచుకున్నాడు . బాధితుడు మోసపోయిన డబ్బులో రూ.21లక్షలు ఈ ఖాతా ద్వారా జమ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత నిందితుడిని విచారించగా వారు నిర్వహించే ఖాతాల ద్వారా రూ.8కోట్ల విలువైన మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఈ నిందితులు దేశవ్యాప్తంగా 18 కేసుల్లో ఉన్నారని, నిందితుడు రవి నుంచి ఒక ఐఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.