సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ): మీ భర్తకు ప్రమాదం జరిగిందని అర్జెంట్‌గా డబ్బులు పంపించాలని బురిడీ కొట్టించారు. రాంపల్లి ప్రాంతానికి చెందిన బాధితురాలికి గత నెల 17న జ్యోతి అనే పేరుతో మరో మహిళ ఫోన్ చేసింది. బెంగుళూర్లో మీ భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగిందని, బలమైన గాయాలు కావడంతో యశోద దవాఖానకు తరలించామంటూ ఏడ్చుకుంటూ మాట్లాడింది.
బాధితురాలు అది నిజమని భావించి ఆరు దఫాలుగా రూ. 2.32 లక్షలు పంపించింది. తరువాత ఆ ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. భర్తకు ఫోన్ చేసి మాట్లాడి, తనను ఎవరో మోసం చేశారని గుర్తించి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.