సిటీబ్యూరో, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ట్రేడింగ్‌లో అధిక లాభాలొస్తాయంటూ నమ్మించి ఓ రిటైర్డు ప్రైవేట్ ఉద్యోగికి సైబర్‌నేరగాళ్లు రూ.35 లక్షలు టోకరా వేశారు. వివరాలు.. పీర్జాదిగూడకు చెందిన బాధితుడి సెల్‌ఫోన్ నంబర్‌ను ఇటీవల సైబర్ నేరగాళ్లు ‘ఎఫ్-5 నాలెడ్జ్ అండ్ వెల్త్’ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేశారు. ఎఫ్ఏఈఆర్పీఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని ట్రేడింగ్ చేస్తే లాభాలొస్తాయంటూ ఆ గ్రూప్‌లో సూచనలు చేశారు.
ట్రేడింగ్ చేసేందుకు తమకు డిజిటల్ సర్టిఫికెట ఉందని, ఆ నంబర్‌ను వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశారు. ఆ తర్వాత బాధితుడికి ఫోన్ చేసి మీరు యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే మీ నంబర్‌ను వీఐపీ 53 ఎఫ్ఏఈఆర్ పీఈ కోర్ టీమ్ గ్రూప్‌లో యాడ్ చేస్తామని తెలిపారు. ఇదంతా నిజమనని భావించిన బాధితుడు వారి చెప్పినట్లు చేయడంతో.. అతడిని కొత్త గ్రూప్‌లో యాడ్ చేశారు. ఆ తర్వాత యూజర్‌నేమ్, పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని కొంత పెట్టుబడి పెట్టి స్టాక్స్ కొనండి అంటూ సూచనలు చేయడంతో బాధితుడు రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత మరిన్ని షేర్స్ కొనమంటూ సూచనలు చేయడతో దఫ దఫాలుగా రూ.35 లక్షలు వరకు పెట్టుబడి పెట్టారు. అందులో రూ. 50 వేలు మాత్రమే లాభం తిరిగి వచ్చాయి.
స్క్రీన్‌పై మాత్రం కోట్ల రూపాయలు కన్పిస్తుండటంతో వాటిని విత్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే సైబర్ నేరగాళ్లు మరిన్ని స్టాక్స్ కొనాలంటూ షరతులు విధించారు. ఖాతాలో నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశం లేకపోవడంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.