గోల్నాక, మే 4: మూసీ నదిపై రూ.52 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న మూసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆదివారం ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. మూసారాంబాగ్ బ్రిడ్జి పనులను పరిశీలించి నిర్మాణంలో తలెత్తుత్తున్న సమస్యలను పరిష్కరించి త్వరగా అందుబాటులోకి తేవాలని ఆయన అధికారులను సూచించారు. సీఎస్ వెంట జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కింది బస్తీలో పర్యటించిన కార్పొరేటర్ హేమ
సికింద్రాబాద్ : శనివారం రాత్రి వీచిన ఈదురుగాలికి సికింద్రాబాద్ పరిధిలోని కింది బస్తీ నల్ల పోచమ్మ ఆలయం దగ్గర చెట్టు కొమ్మలు విరిగాయి. ఈ విషయం తెలుసుకున్న కార్పొరేటర్ హేమ ఆయా కాలనీల్లో పర్యటించారు. చెట్టు కొమ్మల తొలగింపు పనులను పర్యవేక్షించారు. అనంతరం కాలనీవాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.