అబ్దుల్లాపూర్‌మెట్: హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తారామతిపేటలో (Crocodile) మొసలి కలకలం సృష్టించింది. తారామతిపేట నుంచి మూసీ నదిలోకి వెళ్లే కాలువ ద్వారా గ్రామంలోకి మొసలి వచ్చింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో మొసలిని బంధించి జూపార్క్‌కు తరలించారు. దీంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.