సిటీబ్యూరో, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): సైబర్‌నేరాల్లో ఖాతాదారులతోనే కేసుల దర్యాప్తును సరిపెట్టేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీనికితోడు ఇటీవల తెలుగు రాష్ర్టాల్లో ఉండే సైబర్‌నేరగాళ్ల బ్యాంకు ఖాతాదారులను పట్టుకోవడానికే పరిమితమవుతూ ఇతర రాష్ర్టాల్లో ఉండే క్రిమినల్స్ గురించి కనీసం ఆలోచన కూడా చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. సైబర్నేరాలలో బ్యాంకు ఖాతాలు, సిమ్‌కార్డులు ప్రధానం. వీటిని ఇక్కడ అమాయకులు, కమిషన్ పద్ధతిలో ఖాతాలు సేకరించడం, సిమ్‌కార్డు డీలర్ల వద్ద నుంచి ఒకేసారి తీసుకోవడం చేస్తున్నారు. వీటిని ఇతర దేశాలలో ఉండే కీలకమైన సైబర్‌నేరగాళ్లకు పంపిస్తుండడంతో అక్కడి నుంచి సైబర్‌నేరగాళ్లు కొత్త కొత్త ఫోన్ నెంబర్లతో అమాయకులకు ఫోన్ చేసి వలేస్తున్నారు. విదేశాల నుంచి వాట్సాప్ కాల్స్‌లలో మాట్లాడుతూ, చాటింగ్‌లు చేస్తూ అమాయకులను సైబర్నేరాలలోకి లాగేస్తున్నారు. అత్యాశతో పెట్టుబడి, పార్ట్‌టైమ్ మోసాలు జరుగుతుండగా, భయంతో డిజిటల్ అరెస్ట్‌లు జరుగుతున్నాయి. సైబర్‌నేరగాళ్లు చెప్పినట్లు చేస్తూ సూచించిన బ్యాంకు ఖాతాలలో రూ.లక్షలు డిపాజిట్ చేస్తుంటారు. ఈ బ్యాంక్ ఖాతాల నిర్వహణ రెండు మూడు దశలలో జరుగుతుంది.
బ్యాంకు ఖాతాలే కీలకం!
బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతోనే దర్యాప్తు ప్రారంభిస్తారు. ఏ బ్యాంకు ఖా తాలో డిపాజిట్ చేశారు, ఆ బ్యాంకు ఖాతా ను ంచి ఎక్కడికెక్కడి బదిలీ అయ్యాయి, చివరకు ఏ ఖాతాకు వెళ్లాయనే అంశాలపై ఆరా తీస్తారు. ఇందులో భాగంగానే పోలీసులు బ్యాంకు ఖాతాదారుల చిరునామాతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తుంటారు. అయితే బ్యాంకు ఖాతాదారులు కొందరు తెలిసి ఆయా ఖాతాలను కమిషన్లకు కక్కుర్తి పడుతూ సైబర్‌నేరగాళ్లకు అప్పగిస్తుండగా, మరికొందరు అందులో అమాయకులు కూడా ఉంటారు. అలాంటి వారిని పోలీసులు గుర్తిస్తూ తగిన విధంగా చర్యలు తీసుకోవడం సాధారణంగా జరుగుతున్న ప్రక్రియ అయితే, గతంలో వివిధ రాష్ర్టాలలో సైబర్‌నేరగాళ్ల గూర్చి పోలీసులు ఆరా తీస్తూ, కీలక నిందితులు ఎవరు అనే విషయంపై దృష్టి పెట్టేవారు.
ఈ క్రమంలో కొన్ని కేసులలో కీలక నిందితులను పట్టుకోవడం, మరికొన్ని కేసులలో బ్యాం కు ఖాతాలను సైప్లె చేసే వాళ్లను, ఇంకా కొన్ని కేసులలో బ్యాంకు ఖాతాలు ఇక్కడి నుంచి మేనే జ్ చేస్తున్న ముఠాలను అరెస్ట్‌లు చేస్తూ కేసులను ఛేదించే వారు. అయితే నేడు అంత లోతుగా కేసుల దర్యాప్తు జరపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఫిర్యాదు రాగానే దర్యాప్తు ప్రారంభించి బ్యాంకు ఖాతాల చిరునామాలు ఎక్కడున్నాయని ఆరా తీస్తూ దగ్గరలో ఉంటే నిందితులను పట్టుకుంటున్నారు. ఇతర రాష్ర్టాలలో ఉన్నారంటే ఆయా కేసులను పక్కన పెట్టేస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సూత్రదారులపై ఫోకస్ ఏదీ..?
ఇప్పటి వరకు ట్రై పోలీస్ కమిషనరేట్ పోలీసులు ఎక్కువగా బ్యాంకు ఖాతాదారులను పట్టుకుంటున్నారు, అయితే సైబర్‌నేరాల్లో దేశం అవ తల ఉండి నేరాలు చేస్తున్న సూత్రధారులపై ఫోక స్ ఏదీ అంటూ సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నా రు. బ్యాంకు అధికారుల సహకారంతో ఎక్కడికక్కడే సైబర్నేరాలను కట్టడి చేసేందుకు అవకాశాలున్నా ఆ దిశగా ప్రయత్నాలు జరగకపోవడమే నేరగాళ్లకు కలిసోస్తుందని పలువురు పేర్కొ ంటున్నారు. ఇప్పటికైనా కీలక సూత్రధారులపై ఫోకస్ పెట్టాలని బాధితులు కోరుతున్నారు.