హైదరాబాద్ : హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను మంగళ్‌హాట్ పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు నిర్వాహకుల నుంచి రూ. 3.40 లక్షల నగదుతో పాటు ఒక టీవీ, రెండు మొబైల్ ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా సభ్యులను అమర్ నగర్ కాలనీ, ధూల్‌పేటకు చెందిన పీ దీపక్ సింగ్(30), సతీష్ సింగ్(42)గా పోలీసులు గుర్తించారు. దీపక్ సింగ్ ఇంటిని కేంద్రంగా చేసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు మంగళ్‌హాట్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు అమర్ నగర్ కాలనీలోని దీపక్ ఇంటిపై శుక్రవారం అర్ధరాత్రి దాడి చేసి, వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.