హైదరాబాద్: పెండింగ్ చాలాన్ల (Pending Challans) విషయంలో డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నర్సింగ్‌రావుపై బదిలీవేటు పడింది. ఇన్స్పెక్టర్తోపాటు ఎస్ఐ అశోక్, హోంగార్డు కేశవులు, కోర్టు కానిస్టేబుల్ సుధాకర్‌ను కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీచేశారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలోని జర్నలిస్టు కాలనీ చౌరస్తాలో వాహనాల తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ హోం గార్డు పెండింగ్ చలానాలుచెక్ చేస్తున్నాడు. అక్కడికి వచ్చిన వారిలో కొన్ని వాహనాలకు ఎక్కువ మొత్తంలో చలానా పెండింగ్ ఉండడంతో వారిని వదిలిపెట్టేందుకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
ఎవరికీ అనుమానం రాకుండా తమ వద్దకు వచ్చే వాహనదారుడి వద్ద నుంచి రూ.500 చొప్పున వసూలు చేస్తూ చేతికి తీసుకోకుండా పక్కనే ఉంచిన ఆటో ట్రాలీలో నోటు వేసి వెళ్లిపోవాలని అంటూ చెప్పాడు. ఓ వ్యక్తి రూ. 500 నోటును ట్రాఫిక్ హోం గార్డు సూచనతో ట్రాలీలో డబ్బులు వేసి వెళ్లిపోతున్న మొత్తం వ్యవహారాన్ని గుర్తుతెలియని వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడు. అదికాస్తా వైరల్‌గా మారడంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్తోపాటు ముగ్గురు సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకున్నారు.
Pending Challan | చలాన్ పెండింగ్ ఉందా.. అయితే ట్రాలీలో నోటు వేయ్..!