బంజారాహిల్స్, డిసెంబర్ 15 : జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలోని జర్నలిస్టు కాలనీ చౌరస్తాలో వాహనాల తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ హోం గార్డు పెండింగ్ చలానాలు (Pending Challan) చెక్ చేస్తున్నాడు. అక్కడికి వచ్చిన వారిలో కొన్ని వాహనాలకు ఎక్కువ మొత్తంలో చలానా పెండింగ్ ఉండడంతో వారిని వదిలిపెట్టేందుకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
ఎవరికీ అనుమానం రాకుండా తమ వద్దకు వచ్చే వాహనదారుడి వద్ద నుంచి రూ.500 చొప్పున వసూలు చేస్తూ చేతికి తీసుకోకుండా పక్కనే ఉంచిన ఆటో ట్రాలీలో నోటు వేసి వెళ్లిపోవాలని అంటూ చెప్పాడు. ఓ వ్యక్తి రూ. 500 నోటును ట్రాఫిక్ హోం గార్డు సూచనతో ట్రాలీలో డబ్బులు వేసి వెళ్లిపోతున్న మొత్తం వ్యవహారాన్ని గుర్తుతెలియని వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడు ఆ వీడియో వైరల్గా మారింది.