ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు
12-14 ఏండ్లవారికి కొవిడ్ టీకా ప్రారంభం
ఉత్తమ సేవలు అందించిన ఇబ్బందికి ప్రశంసాపత్రాలు
నేరేడ్మెట్, మార్చి 16 : 12-14 సంవత్సరాల పిల్లలందరూ టీకా వేసుకోవాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం నేరేడ్మెట్ డివిజన్ ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలో టీకా కేంద్రాన్ని స్థానిక కార్పొరేటర్ మీనా ఉపేందర్‌రెడ్డితో కలిసి ఆయన ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 2010 లేదా అంతకన్నా ముందు జన్మించిన పిల్లలు టీకా తీసుకోవడానికి అర్హులన్నారు. మొదటిడోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు తీసుకోవా లన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్, నాయకులు ఉపేం దర్‌రెడ్డి, రావుల అంజయ్య, సతీశ్‌కుమార్, గుండా నిరంజన్, ఎస్ఆర్ ప్రసాద్, డివిజన్ అధ్యక్షుడు మహత్యవర్ధన్, శ్రీనివాస్‌రెడ్డి, చెన్నారెడ్డి, చిందం శ్రీనివాస్ పాల్గొన్నారు.
అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో..
మల్కాజిగిరి, మార్చి 16: అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 ఏండ్లు నిండిన పిల్లలకు వ్యాక్సినేషన్‌ను కార్పొరేటర్లు శాంతిశ్రీనివాస్ రెడ్డి, సబితాకిశోర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. కరోనా రాకుండా ముందస్తుగా 12 సంవత్సరాలు.. ఆపై ఉన్న అందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారని అన్నారు. అనంతరం ఆరోగ్యకేంద్రంలో ఉత్తమ సేవలు అందించినవారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్య క్రమంలో డాక్టర్ ప్రసన్నలక్ష్మి, డాక్టర్ నళిని, అనిల్‌కిశోర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
మల్లికార్జుననగర్ కమ్యూనిటీహాల్లో..
గౌతంనగర్, మార్చి16 : గౌతంనగర్ డివిజన్, మల్లికార్జుననగర్ కమ్యూనిటీహాల్లో బుధవారం నేషన్ వ్యాక్సినేషన్ డే సందర్భంగా ప్రభుత్వ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కార్పొరేటర్ మేకల సునీతా రాముయాదవ్ ప్రారంభించారు. 12-14 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలందరికీ టీ వేశారు. కార్యక్రమం లో టీఆర్ఎస్ నాయకులు మేకల రాముయాదవ్, డాక్టర్ రాధ, వైద్య సిబ్బంది లావణ్య, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.