మలక్‌పేట, ఏప్రిల్ 7: పోక్సో కేసులో నిందితునికి కోర్టు 22 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. చాదర్‌ఘాట్ ఇన్స్పెక్టర్ బ్రహ్మమురారి కథనం ప్రకారం.. పాత మలక్‌పేట డివిజన్లోని శంకర్‌నగర్ దోబిగల్లీ కృష్ణ హాస్పిటల్ సమీపంలో ఓ కుటుంబం తన కుమార్తెలతో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తుండగా, పక్కింట్లో నివాసముండే సంగం మనోహర్ (20) బాలికతో పరిచయం పెంచుకొని ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడు.
పెళ్లి చేసుకుంటానని పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడి ఫొటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు. పెళ్లి చేసుకోవాలని బాలిక ఒత్తిడి చేయటంతో వారి కుటుంబ సభ్యులను కూడా బెదిరించాడు. దాంతో బాధితులు 25/9/2021న చాదర్‌ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోక్సో చట్టంకింద కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితున్ని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు.
కేసు పూర్తి ఆధారాలు సేకరించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా, న్యాయమూర్తి నిందితున్ని దోషీగా తేలుస్తూ సీఆర్పీసీ సెక్షన్ 235(2) ప్రకారం 22 సంవత్సరాల జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో ఆరు నెలలు సాధారణ జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని, బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించినట్లు ఇన్స్పెక్టర్ బ్రహ్మమురారి తెలిపారు.